మహిళా ఓటర్లే అధికం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో 423 గ్రామపంచాయతీలతో పాటు 3,674 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తుది ఓటరు జాబితా ప్రకారం 4,99,852 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 2,48,222 మంది, మహిళలు 2,51,349 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. పురుషుల కంటే 3,127 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ‘గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి అవకతవలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం.’ అని డీపీఓ నిఖిల శ్రీ పేర్కొన్నారు.


