ధరాఘాతం..!
కూరగాయల ధరలు కిలో (రూ.లో) ఇలా..
(మంగళవారం మహబూబ్‌నగర్ రైతు బజార్‌లో ధరలు)
బెండకాయ
100
కాకరకాయ
100
బీరకాయ
100
వంకాయ
80-100
బెండకాయ
100
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. నెల రోజులుగా నిలకడ లేకుండా కూరగాయల ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక్క ఆలుగడ్డ మినహా అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో జనం కొనుగోలు చేసే పరిస్థితి లేనివారు పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు.
క్యాప్సికం
100
గోరు చిక్కుడు
80-100
దొండకాయ
80
బీన్స్
120
పచ్చి మిర్చి
100
దోసకాయ
60
టమాట
60
ఆలుగడ్డ 40
వర్షాలతోపంటలకు దెబ్బ...
ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో కూరగాయల తోటలు దెబ్బతినడంతో అవసరానికి తగినట్లు కాయగూరలు లభించడం లేదు. దీంతో స్థానికంగా అందుబాటులో లేని కూరగాయలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, డోన్ నుంచి టమాట, పచ్చిమిర్చి వస్తుండగా, బెంగళూర్ నుంచి ఆలు, దొండకాయ, బీర్నీస్, బీరకాయ, క్యాప్సికం తదితర వాటిని తెప్పించే క్రమంలో అక్కడి వ్యాపారులు డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఒకట్రెండు మినహా ఏది కొందామన్నా కిలో ధర రూ.100 దాటేసింది. ఆకుకూరల పరిస్థితి కూడా ఇదే. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం కంటే జడ్చర్ల, దేవరకద్ర ప్రాంతాల్లో పలు కూరగాయల ధరలు మహబూబ్‌నగర్‌కు కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఇక్కడ చిక్కుడు, బీన్స్, వంకాయ, దోసకాయ, బెండకాయ, క్యాప్సికమ్ ధరలు రూ.100 నుంచి రూ.120 వరకు పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే రైతుబజార్లలో కూడా ధరలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ బయట మార్కెట్ కంటే కొంత తక్కువ ఉన్నట్లు బోర్డుల్లో చూపుతున్నారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత గ్రేడింగ్ పద్ధతిలోనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని కూరగాయలను బోర్డులో ఉన్నదానికంటే రూ.20 ఎక్కువగా విక్రయిస్తున్నారు. నాణ్యమైన కూరగాయలు ఇక్కడ బహిరంగ మార్కెట్ ధరలకు కొంచెం అటు ఇటుగా అమ్ముతున్నారు. కాగా.. కిలో రూ.వంద ఉన్నా.. పావు కిలో రూ.30, అర కిలో రూ.60 చొప్పున అమ్ముతున్నారు.
ఆకాశాన్నంటినకూరగాయల ధరలు
టమాట, ఆలుగడ్డ మినహా అన్నీ రూ.వంద పైనే.
సామాన్యుల విలవిల


