అన్నీ పెరగడం ఇదే మొదటిసారి
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నలుగురు పెద్దవాళ్లు ఉంటే రోజుకు 60 నుంచి 80 రూపాయల వరకు కూరగాయలకే అవుతాయి. అన్ని రకాల కూరగాయలకు ఒకేసారి ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి కావొచ్చు. నెల రోజుల క్రితం టమాట రూ.20 ఉంటే ఇప్పుడు రూ.60 అయింది. పెరిగిన ధరలు చూసి కిలో బదులు పావు కిలో, అర కిలో కొనాల్సి వస్తోంది.
– కమల, గృహిణి, మహబూబ్‌నగర్
దిగుమతి చాలా తగ్గింది
జిల్లా చుట్టుపక్కల నుంచి కూరగాయల దిగుమతి చాలా తగ్గిపోయింది. సరిపడా రాక ధరలు పెరిగాయి. ఈసారి భారీ వర్షాల కారణంగా కూరగాయల ఉత్పత్తులు తగ్గిపోయాయి. 20 రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.
– కుంచం మోహన్‌బాబు,
వ్యాపారి, మహబూబ్‌నగర్
రూ.8 వేలు ఖర్చు అవుతోంది
ఒకప్పుడు కిరాణ షాపులో నెలకు సరిపడా పప్పు దినుసులు గతంలో రూ.3000 నుంచి రూ.4000కు వచ్చేవి. కానీ ఇప్పుడు పెరిగిన ధరలకు రూ.8వేలకు పైగా ఖర్చవుతోంది. ఇక కూరగాయలు కొనాలంటేనే భయమేస్తుంది. మార్కెట్‌కు వెళ్తే రూ.500 పెడితే కనీసం చిన్నపాటి సంచికి సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు.
– హర్షవర్దన్, మహబూబ్‌నగర్
ఆర్థిక భారం పడుతోంది
గతంలో రూ.150కు పది రకాల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500లకు సరిపడే కాయగూరలు రావడం లేదు.మారుతున్న కాలంతో పాటు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం నిత్యావసర సరుకుల మీద దృష్టి సారించి మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడాలి.
– మేకల సత్యం, డ్రైవర్, మహబూబ్‌నగర్
●
అన్నీ పెరగడం ఇదే మొదటిసారి
అన్నీ పెరగడం ఇదే మొదటిసారి
అన్నీ పెరగడం ఇదే మొదటిసారి


