గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాలి: ఎస్పీ
మహమ్మదాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. మంగళవారం మహమ్మదాబాద్ పోలీస్టేషన్‌ను ఆమె సందర్శించారు. అంతకుముందు మండలకేంద్రంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జూనియర్ కళాశాలను పరిశీలించి.. పరీక్షల సమయంలో ఇబ్బందులు కలగకుండా ముందే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్టేషన్‌లో ఫైళ్లను పరిశీలించి కేసుల నమోదు, పరిష్కరించినవి.. తదితర వాటిని పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితుల సమస్యలు వేగంగా పరిష్కరించాలని, ఫైళ్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


