చిన్నారుల కోసం ఫిర్యాదుల పెట్టె..!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సాధారణంగా కార్యాలయాల్లో సమస్యల పరిష్కారానికి ఫి ర్యాదుల పెట్టె ఉండే విషయం అందరికీ తెలిసిందే. అయితే చిన్నారుల కోసం ప్రత్యేకంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అందులో విద్యార్థులతో పాటు 18 ఏళ్ల లోపు వారు తమ కాలనీలో ఏమై నా సమస్యలు ఉంటే స్వయంగా రాసి అందు లో వేయవచ్చు. కార్యాలయంలో ఏయే సేవలు అందిస్తారో తెలుసుకోవ చ్చు. ఇతరుల నుంచి తాము ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తెలియజేయవచ్చు. దీనివల్ల చిన్నారుల్లో ప్రశ్నించేతత్వం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 15 రోజులకోసారి దానిని తెరిచి అందులో వచ్చిన సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొంటున్నారు.


