
జూరాలకు పోటెత్తిన వరద
ధరూరు/రాజోళి/మదనాపురం/దేవరకద్ర: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ప్రాజెక్టుకు 2లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు 2.45 లక్షలకు చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 38 క్రస్టు గేట్లను ఎత్తి 2.47 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 24వేల క్యూసెక్కులు వదలగా.. 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6.987 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సుంకేసులకు లక్ష క్యూసెక్కులు..
సుంకేసుల డ్యాంకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మంగళవారం ఎగువ నుంచి 1.30లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా..ఐదు గేట్లను ఒక మీటర్ మేర, 15 గేట్లను రెండు మీటర్ల మేర తెరిచి 1.25లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. కేసీ కెనాల్‌కు 2,180 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
38 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

జూరాలకు పోటెత్తిన వరద