
కోయిల్‌సాగర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం 2 గేట్లను ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. సోమవారం ఇన్‌ఫ్లో భారీగా రావడంతో అయిదు గేట్లను తెరిచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు.. నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మొత్తం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. మంగళవారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఇప్పటివరకు 529.752 మి.యూనిట్లను విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.