
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిఽధిలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీతభగత్ తెలిపారు. మంగళవారం ఆమె అమరగిరి సమీపంలోని బలపాలతిప్ప వద్ద చేపట్టిన టూరిజం డెవలప్‌మెంట్ పనులు, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్‌ను పరిశీలించారు. టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గూర్చి స్థానిక అధికారులకు సూచించారు. వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులు కలుగకుండా, పర్యాటక అభివృద్ధికి ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సహకారం అందిస్తున్నట్లు వివరించారు. సోమశిలలోని లలితాంబికా సోమేశ్వరాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం కృష్ణానదిలో బోటులో విహరించారు. కార్యక్రమంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హీరేమత్, డీఎఫ్‌ఓ రోహిత్‌గోపిడి, ఎఫ్‌డీఓలు రామ్మోహన్, చంద్రశేఖర్, రేంజర్ ఈశ్వర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీత భగత్