పురుగుల మందు తాగి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి మహిళ మృతి

Aug 20 2025 6:17 AM | Updated on Aug 20 2025 6:17 AM

పురుగ

పురుగుల మందు తాగి మహిళ మృతి

పెద్దకొత్తపల్లి: భార్యాభర్తల గొడవ కారణంగా మనస్తాపానికి చెందిన భార్య ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఎస్‌ఐ సతీశ్‌ కథనం ప్రకారం.. మరికల్‌కు చెందిన ఏడుపుల గీత (22) ఈనెల 17న భార్య, భర్తలు గొడవ పడి మనస్తాపంతో కలుపునివారణ మందు తాగింది. అపస్మారకస్థితికి చేరుకోవడంతో నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి నాలుగునెలల పాప ఉంది. మృతురాలి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

యువతి అదృశ్యం

ఉండవెల్లి: మండలంలోని మెన్నిపాడు గ్రామానికి చెందిన కస్తూరి(25) అనే యువతి నెల క్రితం నుంచి మండల కేంద్రంలోని పెద్దమ్మ సుగుణమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. ఎంతకూ ఆచూకీ తెలియక పోవడంతో మంళగళవారం కస్తూరి అక్క సంధ్యపోగు సరస్వతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో

గొర్రెలకాపరి మృతి

కొత్తకోట రూరల్‌: పెద్దమందడి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన కాపరి రాగమోని మల్లయ్య(40) ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. అక్కడే మరో కాపరి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఆర్‌ఐ గణేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. గొర్రెలను మేపేందుకు వ్యవసాయ పొలాలకు వెళ్లడంతో అక్కడ బోరుబావి వద్ద విద్యుత్‌ తీగలు తగిలి మృతిచెందినట్లు ఆర్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నట్టు బంధులువు తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలుశిక్ష

పాన్‌గల్‌: మండలంలోని గోప్లాపూర్‌లో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి కళార్చన తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన బింగి రామదాసుకు, బింగి శ్రీశైలంకు కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. 2023, జూలై 14 రాత్రి రామదాసు గొర్రెల దగ్గరికి ఒంటరిగా వెళ్తుండగా గ్రామ శివారులో అప్పటికే మాటు వేసి ఉన్న శ్రీశైలం ఒక్కసారిగా గొడ్డలితో తలపై దాడి చేశాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ రవిప్రకాష్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం శ్రీశైలంను రిమాండ్‌కు తరలించారు. కోర్టులో విచారణ జరగగా మంగళవారం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

బైక్‌ చోరీకి యత్నం..

పోలీసులకు అప్పగింత

జడ్చర్ల టౌన్‌: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో బైక్‌ను చోరీ చేసేందుకు యత్నిస్తున్న వ్యక్తిని సెక్యూరిటీ నర్సింహులు పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పూర్తి వివరాలు.. ఆర్టీసీ క్యాంటీన్‌ ఎదుట పార్క్‌ చేసి ఉన్న బైక్‌ను ఎత్తుకెళ్లేందుకు నిందితుడిని గమనించి పట్టుకున్నట్లు ఆర్టీసీ సిబ్బంది పేర్కొన్నారు.

పురుగుల మందు తాగి మహిళ మృతి 
1
1/1

పురుగుల మందు తాగి మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement