
చిరుత.. లింగాయిపల్లిలో ప్రత్యక్ష్యం
గండేడ్: ఇటీవల మహబూబ్‌నగర్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత తాజాగా గండేడ్ మండలంలో కలకలం రేపింది. మంగళవారం రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడిని గాయపరిచింది. మండలంలోని లింగాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గత్ప నరేశ్ మంగళవారం సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో బైక్‌పై రంగారెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో లింగాయిపల్లి నుంచి చింతగుట్టకు వెళ్లేదారి వద్దకు రాగానే చిరుత అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు దూకింది. అదే సమయంలో బైక్‌పై అక్కడికి చేరుకున్న నరేశ్ చేతికి చిరుత కాలు గీసుకుపోవడంతో ఎడమ చెతికి గాయమైంది. చిరుత చింతగుట్ట వైపునకు వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం అతను గండేడ్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొన్నాడు. అయితే మరోసారి చిరుత గండేడ్ మండలంలో సంచరించడం మండల వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. చింతగుట్ట వైపు వెళ్లిన చిరుత అవతలికి దాటే అవకాశం లేదు. ఎందుకంటే సాలార్‌నగర్ ప్రాజెక్టు నిండి ఉధృతంగా అలుగు పారుతుండడంతో ఇటువైపే సంచరించే అవకాశం ఉంది. భయాందోళనతో పొలాల వద్ద కట్టేసిన పశువులను స్థానికులు ఇళ్లకు తీసుకొచ్చారు.
రోడ్డు దాటుతూ వాహనదారుడికి గాయం
రెండోసారి గండేడ్ మండలంలో సంచారం
అప్రమత్తంగా ఉండాలి
చిరుత సంచరించిన సమాచారం అందింది. బుధవారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తాం. అది చిరుతనా, పులినా, లేక ఇంకేమైనా తిరుగుతుందా పరిసరాలను పూర్తిగా పరిశీలిస్తాం. అప్పటి వరకు చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– మహమ్మద్ అబ్దుల్ హై,
రేంజర్, మహమ్మదాబాద్ రేంజ్