
గోల్డ్ మెడల్ అందుకున్న అశ్విని
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయురాలు పోలె అశ్విని ఎంఏ తెలుగులో సంప్రదాయ సాహిత్య పాఠ్యాంశాలలో అత్యధిక మార్కులు సాధించి ఉస్మానియ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. మంగళవారం ఓయూ 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిష్ణుదేవ్‌శర్మ, ఇస్రో చైర్మన్ నారాయణ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాలమూర్ యువ కవుల వేదిక అధ్యక్షుడు బోలయాదయ్య పోలె అశ్వినికి అభినందనలు తెలియజేశారు.
కొండచరియలు
తొలగింపు
దోమలపెంట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం ఈగలపెంట ఎస్‌ఐలు జయన్న, శ్రీను సిబ్బందితో కలిసి రోడ్డుపై పడిన రాళ్లను తొలగించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో కొండచరియలు రోడ్డుపై పడ్డాయని పొక్లెయిన్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం తొలగించినట్లు పేర్కొన్నారు.

గోల్డ్ మెడల్ అందుకున్న అశ్విని