
500 మీటర్ల జెండాతో తిరంగా ర్యాలీ
79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జడ్చర్ల పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా తిరంగార్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని కళాశాల, హైస్కూల్ విద్యార్థులు పట్టుకుని అంబేద్కర్ చౌరస్తా నుంచి నేతాజీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యంబీ బాలకృష్ణ, నాయకులు రాపోతుల శ్రీనివాస్‌గౌడ్, ఎడ్ల బాలవర్దన్‌గౌడ్, సాహితీరెడ్డి, కొంగళి శ్రీకాంత్, అమర్‌నాథ్‌గౌడ్, నరేష్‌నాయక్, శ్రీనాథ్, లక్ష్మారెడ్డి, రేఖ, పిట్టల నరేష్, జగదీశ్‌సింగ్, వివ్వనాథ్, నరేందర్, నవీన్‌లు పాల్గొన్నారు.
– జడ్చర్ల టౌన్