జూరాలకు కొనసాగుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు కొనసాగుతున్న వరద

Aug 13 2025 9:35 PM | Updated on Aug 13 2025 9:35 PM

జూరాలకు కొనసాగుతున్న వరద

జూరాలకు కొనసాగుతున్న వరద

ధరూరు: ఎగువన కురస్తున్న వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 7 గంటల వరకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్టు గేట్లను ఎత్తి 68,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36,541 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 236 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 50 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.057 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.203 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 121.957 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 4 క్రస్టు గేట్లను ఎత్తి 19,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మూడేళ్ల అనంతరం..

ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 2023లో మొరాయించి పని చేయకుండా ఉన్న మూడో యూనిట్‌ ఎట్టకేలకు మంగళవారం వినియోగంలోకి వచ్చింది. తెల్లవారుజామున ఎస్‌ఈ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూడో యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తిని విజయవంతంగా ప్రారంభించారు.

సుంకేసులకు..

రాజోళి: సుంకేసుల ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 13 గేట్లను ఒక మీటర్‌ మేర తెరిచి 56,927 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్‌ 2,012 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.

473.254 ఎంయూ విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 216.545 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 256.709 మిలియన్‌ యూనిట్లు కలిపి 473.254 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.

1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ప్రాజెక్టు 10 క్రస్టు గేట్ల ఎత్తివేత

1.05లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement