
మహబూబ్‌నగర్ ఆర్టీసీకి గి‘రాఖీ’
స్టేషన్ మహబూబ్‌నగర్: రాఖీ పండుగకు మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. పండుగ వేళ వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులు నడిపారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ మార్గంలో ఎక్కువ బస్సులు నడపడంతో రీజియన్‌కు అధిక ఆదాయం సమకూరింది.
● ఈ ఐదు రోజుల్లో ఆక్యుపెన్షి రేషియాలోనూ రాష్ట్రస్థాయిలో మహబూబ్‌నగర్ రీజియన్ 139 శాతం సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. బస్సులు 19.56 లక్షల కిలోమీటర్లు తిరిగి 26.63 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది కంటే ఈసారి 15 వేల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణం చేశారు. డిపోల పరంగా చూస్తే మహబూబ్‌నగర్ రూ.2,54,98,000, వనపర్తి డిపో రూ.2,26,70,000 అధిక ఆదాయాన్ని పొందాయి.
డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, ఇతర ఉద్యోగుల సమష్టి కృషితోనే ఆక్యుపెన్సి రేషియో 139 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలకు దూరంగా ఉండి విధులకు హాజరవడం గర్వకారణం. పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీపై ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లా ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
– పి.సంతోష్‌కుమార్, రీజినల్ మేనేజర్
తేదీల వారీగా ఇలా.. వచ్చిన ఆదాయం (రూ.లలో..)
8 తేదీన
2,48,37,000
7 తేదీన
2,16,31,000
9 తేదీన 3,70,74,000
10 తేదీన
3,85,60,000
11తేదీన
3,94,34,000
డిపో తిరిగిన కిలోమీటర్లు ఆదాయం
(లక్షల్లో..) (రూ.లక్షల్లో..)
మహబూబ్‌నగర్ 3.00 254.98
వనపర్తి 2.54 226.70
కల్వకుర్తి 2.16 182.29
షాద్‌నగర్ 1.86 169.65
నారాయణపేట 2.03 163.90
గద్వాల 2.31 159.68
అచ్చంపేట 1.97 157.90
నాగర్‌కర్నూల్ 1.81 151.94
కొల్లాపూర్ 1.54 122.57
కోస్గి 0.34 25.75
డిపోల వారీగా ఆదాయం
ప్రతి ఉద్యోగి కృషితోనే సాధ్యమైంది..
5 రోజులు.. రూ.16.15 కోట్ల ఆదాయం
11వ తేదీన అధికంగా రూ.3.94 కోట్లు
ఆక్యుపెన్షి రేషియాలో రాష్ట్రంలోనే మొదటిస్థానం

మహబూబ్‌నగర్ ఆర్టీసీకి గి‘రాఖీ’