
చెంచు మహిళకు అరుదైన గౌరవం
మన్ననూర్/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నల్లమల్ల చెంచు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకొండ వద్ద 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ చెంచు మహిళా సమాఖ్య నుంచి అటవీ లోతట్టు ప్రాంతం కుడిచింతలబైలు గ్రామానికి చెందిన భౌరమ్మ పాల్గొననుంది. సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలులో భౌరమ్మ ఆమె భర్త వెంకటయ్య ఢిల్లీకి బయలుదేరారు. డీఆర్డీఓ అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. గొప్ప వాళ్లకు లభించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని.. అవకాశం కల్పించిన సెర్ప్ అధికారులు, డీఆర్డీఓ అధికారులకు భౌరమ్మ ధన్యవాదాలు తెలిపారు.