
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన బైక్
నాగర్‌కర్నూల్ క్రైం: నీటి ఉధృతికి ద్విచక్రవాహనం కొట్టుకుపోయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగనూలు సమీపంలోని కల్వర్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నాగనూలు గ్రామానికి చెందిన శివ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు బాధితుడిని కాపాడగా ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.