
జిల్లాకేంద్రంలో గంట పాటు భారీ వర్షం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎస్.ఆర్.నగర్, బీకే రెడ్డి, కాలనీ, నాగిరెడ్డికాలనీ, వెంకటరమణకాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, పాల్కొండ బైపాస్, రాయచూర్ రోడ్డు తదితర ప్రాంతాలతో పాటు కొత్త బస్టాండు ప్రాంగణంలో వరద ఏరులై పారింది. ఆయా చోట్ల వెంటనే మున్సిపల్ కార్మికులు వరదనీటిని కాల్వల ద్వారా మళ్లించడంతో పరిస్థితి యధాస్థితికి చేరింది. ఇక పెద్దచెరువు (మినీ ట్యాంక్‌బండ్) లోకి వస్తున్న వరద ఉద్ధృతిని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
వరద నీటిని మళ్లించిన మున్సిపల్ కార్మికులు