
కమాలొద్ధీన్‌పూర్ బ్రాంచ్‌కెనాల్‌కు కోత
అప్పారెడ్డిపల్లి కాల్వకు..
మండలంలోని అప్పారెడ్డిపల్లికి సాగునీందించే కాల్వకు బుడ్డఏనె దగ్గర ఏర్పాటు చేసిన పైపు మరీ చిన్నదిగా ఉండడంతో పాటుకాల్వలోకి నీళ్లు నేరుగా వెళ్లకుండా పిచ్చిమొక్కలు ఉండడంతో ఆదివారం కురిసిన వర్షానికి నీళ్ళు పంటపొలాల మీదుగా పారాయి. ఆ ప్రాంతంలోని చెన్నకేశవులు, చెన్నయ్య తదితర రైతులకు సంబంధించిన పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వెంటనే కాల్వ వద్ద మరమ్మతు పనులు చేపట్టి నీళ్లు పొలాలకు రాకుండా చూడాలని, లేకుంటే తమ పంటలు పూర్తిగా నీటిలో మునిగి నష్టపోతామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వచ్చాం.. చూశాం.. వెళ్లాం అన్నట్లు కాకుండా మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఖిల్లాఘనపురం: మండలంలోని పలు గ్రామాలకు సాగునీరందించే కమాలోద్ధీన్‌పూర్ బ్రాంచ్‌కెనాల్ తెగిపోవడంతో వరి, పత్తి పంటలు పాడైపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బ్రాంచ్‌కెనాల్ అల్లమాయపల్లి శివారులో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తెగిపోయింది. కాల్వ, వర్షపు నీళ్లు పెద్దఎత్తున పంట పొలాల్లో పారడంతో రైతు శేషయ్యకు చెందిన వరిపంట పెద్దఎత్తున నీటిలో మునిగిపోయింది. పొలంలో ఇసుక మేటలు వేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. రూ.లక్షలు వెచ్చించి ఇటీవలు వరి సాగుచేయగా.. కాల్వ తెగి ఇసుక మేటలు వేయడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు పరిశీలించి కాల్వ నీళ్లు రాకుండా చేయాలని ప్రభుత్వం నుంచి తనకు ఆర్థిక సాయం అందేలా చూడాలని వేడుకొంటున్నాడు.
పంటపొలాల్లో పారిన కాల్వనీళ్లు
ఇసుక మేటలతో దెబ్బతిన్న వరి పంట
ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు

కమాలొద్ధీన్‌పూర్ బ్రాంచ్‌కెనాల్‌కు కోత