
కల్యాణ.. వైభోగమే
ఆడపడుచులకు సోదరులపై ఉండే ఎల్లలు లేని ప్రేమ, ఆప్యాయత నిదర్శనమే రాఖీ. రాఖీ పండుగను పురస్కరించుకొని శనివారంమంత్రి వాకిటి శ్రీహరికి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారి సోదరీమణులు రాఖీ కట్టారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన సోదరి కుమార్తె సరళ, అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణకు సోదరీమణులు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి బ్రహ్మకుమారీస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బీకే మహాదేవి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సోదరి శ్రీదేవి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. – సాక్షి, నెట్‌వర్క్
రాఖీ కట్టి..
నిండుగా
ఆశీర్వదించి..
మహబూబ్‌నగర్ రూరల్: పౌర్ణమిని పురస్కరించుకొని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ వేడుక జరిగింది. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి పాల్గొన్నారు.
వైభవంగా
లక్ష్మీ హయగ్రీవుల కల్యాణం
ఎర్రవల్లి: శ్రావణ పౌర్ణమిని పురష్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శనివారం శ్రీలక్ష్మీ హయగ్రీవుల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ వేడుక జరిపారు. కాగా, పవిత్రోత్సవాల చివరిరోజు ఆలయంలో వేద దివ్యప్రభంద పారాయణం, యాగశాలలో చుతుస్థానార్చన, మూలమంత్ర మూర్తి హోమాలు, శాంతిహోమం, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహానివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు పాల్గొన్నారు.
రాఖీ పండుగను పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు
కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు ఆరుబయట సైతం జనం రద్దీ కనిపించింది. ప్లాట్‌ఫాంపైకి బస్సు రాగానే ప్రయాణికులు ఎగబడి ఎక్కారు. ప్రయాణికుల రద్దీ దృష్టా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మరోవైపు స్వగ్రామాలకు వెళ్లే వారితో రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. పెద్దఎత్తున వాహనాలు రోడ్డుపైకి రావడంతో
క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జడ్చర్ల సిగ్నల్‌గడ్డ వద్ద సైతం షరా మామూలే అన్నట్టుగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
– సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్
కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
చిన్నచింతకుంట: శ్రావణ రెండో శనివారం, పౌర్ణమిని పురస్కరించుకొని కురుమూర్తి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి.. స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణ మార్మోగింది. కొందరు భక్తులు సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. అమ్మాపురం సంస్థానాధీశుడు రాజ శ్రీరాంభూపాల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘రాఖీ’ సందడి
మన్యంకొండలో వైభవంగా
వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే

కల్యాణ.. వైభోగమే