
ట్రాఫిక్ నియంత్రణ కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వన్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. అందువల్ల కొంచెం చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దానికనుగుణంగా దసరా, సంక్రాంతి, రాఖీ పండుగ రోజుల్లో స్పెషల్ ఆపరేషన్స్‌లో వన్‌సైడ్ ట్రాఫిక్‌ను నియంత్రించడం కోసం ప్రత్యేక బస్సుల వరకు అదనంగా 30 శాతం పెంచుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల్లో ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాం. ఈ నెల 9 నుంచి 11 వరకు మాత్రమే అదనపు చార్జీలు ఉంటాయి.
– సంతోష్‌కుమార్, ఆర్‌ఎం, మహబూబ్‌నగర్
ఇప్పటికే పాస్ ధరలు పెంచారు
నేను డిగ్రీ చదువుతున్నా. ఇప్పటికే స్టూడెంట్ పాస్‌కు సంబంధించి ధరలు పెంచారు. ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో చార్జీలు పెంచడం బాధాకరం. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఎక్‌ప్రెస్ బస్సుల్లో గతం కంటే ఎక్కువ పెంచారు. ఆదాయం కోసం ఇలా ప్రయాణికులపై అదనపు భారం వేయడం సరికాదు.
– శ్రీనునాయక్, పెద్దతండా, కోయిలకొండ మండలం
అదనపు చార్జీలు సరికాదు
రాఖీ పండుగ అయిపోయిన తర్వాత కూడా అదనపు చార్జీలు తీసుకోవడం సరికాదు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి డీలక్స్ బస్సులో గతంలో రూ.190 ఉంటే రూ.250 టికెట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం. చార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చార్జీలు పెంచకూడదని నా విజ్ఞప్తి.
– శేఖర్‌రెడ్డి, మహబూబ్‌నగర్
●

ట్రాఫిక్ నియంత్రణ కోసమే..