
రోడ్డు ప్రమాదంలో ఏఈ దుర్మరణం
ఊట్కూర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వార్‌కి చెందిన విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఏఈ శివరాజ్ (26) తెలంగాణ సరిహద్దు గ్రామం పులిచింతల వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా.. ఉదయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా విధులు ర్వహించేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్ సహాయంతో జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడలోని మెట్రో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు.
ఉద్యోగంలో చేరిన 7 నెలలకే..
గత 7 నెలల క్రితం సూర్యపేట జిల్లా పులిచింతల జల విద్యుత్ కేంద్రంలో ఏఈగా విధుల్లో చేరాడు. బిజ్వార్ గ్రామంలోని దళితవాడకు చెందిన బాబు, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తండ్రి బాబు పిల్లలు చిన్నతనంలోనె గుండెపోటుతో మృతిచెందాడు. తల్లి వెంకటయ్య, అన్నయ్య వెంకటేశ్ తమ్ముడు శివరాజ్‌కు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. 10వ తరగతి వరకు బిజ్వార్ ప్రభుత్వ పాఠశాలలో చదివి, మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో త్రిబుల్ ఈ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో బిటెక్ పూర్తి చేశారు. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో విద్యుత్ ఏఈగా పులిచింతల ప్రాజెక్టులో విధుల్లో చేరాడు. బతుకు తెరువు కోసం వెళ్లిన శివరాజ్ ఉద్యోగంలో చేరిన 7 నెలలకే మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
దోమలపెంట: శ్రీశైలం ఆనకట్ట దిగువన ఎడ మ పాతాళగంగ స్నానాల ఘట్టం సమీపంలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైనట్లు ఈగలపెంట ఎస్‌ఐ జయన్న సోమవారం తెలిపా రు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. కృష్ణానదిలో వ్య క్తి మృతదేహం తేలియాడుతుండడం గమనించిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో పోస్ట్‌మార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఒంటి మీద ఫు ల్ డ్రాయర్ తప్ప మరేమి లేవన్నారు. ఎటువంటి వివరాలు తెలియరాలేదన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాగులో కొట్టుకుపోయి వలస కూలీ మృతి
తెలకపల్లి: వాగులో కొట్టుకుపోయి వలస కూలీ మృతి చెందిన సంఘటన మండలంలో సోమ వారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్త్రం బలియా జిల్లాకు చెందిన బి నర్సు (66) నెల్లికుదురు సమీపంలో క్రషర్ వద్ద వలసకూలీగా పని చేస్తున్నాడు. గట్టునెల్లికుదురు గ్రామానికి వెళ్లి నిత్యవసర సరుకులు తీసుకొని తిరిగి క్రషర్ వద్దకు వస్తున్నాడు. ఈ క్రమంలో గట్టురాయిపాకుల–నెల్లికుదురు గ్రా మాల మధ్య ప్రవహిస్తున్న వాగు దాటుతుండగా ప్రమాద వశాత్తు వాగులో కొట్టుకుపోయా డు. సోమవారం ఉదయం ఒడ్డుకు చేరుకున్న బి నర్సు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని సహ చరుడు మనోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చేపల వేటకు
వెళ్లి వృద్ధుడి మృతి
పాన్‌గల్: చేపల వేటకు వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన చికిరాల బిచ్చయ్య(62) కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం చేపల వేట కోసం గ్రామ శివారులోని చిన్నపులికుంటకు వెళ్లి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషయం ఎవరూ గుర్తించకపోవడంతో సోమ వారం ఉదయం కుంటలో మృతదేహం తేలియాడగా గ్రామస్తులు గమనించి నీటిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీసి చికిరాల బిచ్చయ్యగా గుర్తించారు. ఈ విషయమై బిచ్చయ్య చిన్నమ్మ కుమారుడు గడమాల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
మల్దకల్: పురుగుల మందు తాగిన మహిళ చికి త్స పొందుతూ సోమవారం మృతి చెందిన సంఘటన మల్దకల్‌లో చోటు చేసుకుంది. హె డ్‌కానిస్టేబుల్ గోపాల్‌నాయక్ వివరాల మేరకు.. మల్దకల్ గ్రామానికి చెందిన జయలక్ష్మి (26) గత నెల 26న వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఆమెతో భర్తకు సెల్‌ఫోన్ లభించింది. దీంతో భర్త ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన భార్య వ్యవసాయ పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆమెను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. భర్త నర్సింహులు, కుమార్తె ఉన్నారు.