
జూరాలకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సోమవారం రాత్రి 7.30 గంటల వరకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు15 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 1.06లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 30,422 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, నెట్టెపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 50 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.969 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 121.606 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. నారాయణపూర్ ప్రాజెక్టుకు 30,370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 14 క్రస్టు గేట్లను ఎత్తి 54,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
465.133 ఎంయూ విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 213.031 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 252.102 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
శ్రీశైలానికి 2లక్షల క్యూసెక్కుల వరద
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి సోమవారం 2.14 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. జూరాలలో ఆనకట్ట స్పిల్‌వే ద్వార 1.06లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 30,422 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 67,312 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 10,040 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుకుంటోంది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పతి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,887 మొత్తం 66,202 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.8 అడుగుల నీటిమట్టం వద్ద 197.9120 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వార 32 వేలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్‌ఐకు 1,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.626 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.049 మి.యూనిట్ల విద్యుదుత్పుత్తి చేశారు.
ప్రాజెక్టు 15 క్రస్టు గేట్ల ఎత్తివేత
1.38 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..