
పురుగు మందు తాగిన యువతిని బైక్‌పై ఆస్పత్రికి తరలింపు
మహబూబాబాద్ జిల్లా: పురుగు మందు తాగిన ఓ యువతిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లేందుకు గంటన్నరపాటు ఎదురుచూసినా 108 వాహనం రాకపోవడంతో, బాధితురాలికి సెలైన్ బాటిల్ పెట్టుకొని బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోత్ మేఘమాల (18) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూం క్లీన్‌చేసే యాసిడ్ తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇరుగుపొరుగు వారు గమనించి ఆ యువతిని బైక్‌పై గార్ల సీహెచ్‌సీకి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో సీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న 108 వాహనం రమ్మంటే కాసేపు డ్రైవర్ లేడని, కాసేపు మరమ్మతుకు గురైందని సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పారు.
దీంతో వారు మరో 108 వాహనా నికి ఫోన్ చేశారు. గంటన్నర అయినా రాకపో వడంతో గత్యంతరం లేక మేఘమాలకు సెలైన్ బాటిల్ పెట్టించి తన బాబాయ్ బైక్‌పై ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో 108 వాహనం వచ్చింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది తీరుపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యువతి పురుగుల మందు తాగడానికి గల కారణాలు తెలియరాలేదు.