నిలువురాళ్ల పరిశోధనకు సహకారం
కృష్ణా: మండలంలోని ముడుమాల్ నిలువురాళ్ల పరిశోధనకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ చేస్తున్న కృషి అమోఘమని, వారికి తన సహాయ సహకారాలు అందిస్తామని పురవాస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావువ అన్నారు. మంగళవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతంలోని సప్తరుషి మండలి తదితర వాటిని ఆయన పరిశీలించారు. అనంతరం దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్ మణికొండతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిలువురాళ్ల ప్రదేశంలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసేందుకు త్వరలోనే తవ్వకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ పుల్లారావు, నాగలక్ష్మి, రాములునాయక్, రాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


