గెలుపు ముఖ్యం బిగిలూ..
● చివరి విడత ఎన్నికల్లో కొనసాగిన ప్రలోభాలు
● బాలానగర్ మండలంలో అత్యధికంగా ఓటుకు
రూ.5 వేల వరకు అందజేత
● అభ్యర్థులందరి ఖర్చు కలిపి రూ.కోట్లలోనే..
పాలమూరు: ‘ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి.. పరువు నిలబెట్టుకోవాలి’ ఇదే నినాదం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా అభ్యర్థులు, నాయకుల నుంచి వినిపిస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాట పట్టేందుకు రూ.లక్షలు ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. బుధవారం ఐదు మండలాల్లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం తుది దశ పంచాయతీ ఎన్నిక సందర్భంగా పంపకాలు మంగళవారం రాత్రి వరకు సాగాయి. గ్రామాల్లో కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అంతర్గతంగా కలిసి, మద్యం, నగదు, ఇతర కానుకలు అందజేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు సమర్పిస్తే తప్పా ఎన్నికల్లో గెలవడం కష్టమే ధోరణి పెరగడంతో అభ్యర్థులు అందుకు సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి.. మరో చోట కుల, యువజన సంఘాల ప్రతినిధులను కలిసి క్రీడా, వంట సామగ్రి ఇస్తూ ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
చివరి విడత ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఇంటింటికీ కిలో చికెన్ పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఇళ్లల్లో ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటే మటన్ కూడా అందిస్తున్నారు. వాటిని వద్దన్న వారికి స్వీట్‌బాక్స్‌లు పంపిణీ చేస్తున్నారు. అడ్డాకుల, భూత్పూర్ మండలాల పరిధిలో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు.. జడ్చర్ల పరిధిలో రూ.3 వేల వరకు ఇస్తే అత్యధికంగా బాలానగర్ మండలంలో చాలా గ్రామాల్లో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. భూత్పూర్ మండలంలోని ఓ గ్రామంలో హ్యాండ్ బ్యాగ్‌ల్లో మద్యం బాటిల్స్ పెట్టి ఇచ్చినట్లు తెలిసింది. ఎలాగైనా విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నం చేశారు. మరికొందరు అభ్యర్థులు ఎదుటి వర్గం ఏమేమి పంపిణీ చేస్తున్నారో ఆరా తీసి అంతకు ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండవ విడతలో హన్వాడ మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడి రూ.కోటి ఖర్చు చేశారు.
చారిత్రాత్మక గ్రామం ముంపులో..
వల్లూరుకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముందుగా ఊరంతా కోటలనే ఉండేదని పెద్దలు చెప్పేవాళ్లు. కాలక్రమేణా కోట బయట ఇండ్లు నిర్మాణమయ్యాయి. ఇప్పుడు కోట, ఇండ్లు అన్ని ముంపులోకే వెళ్తున్నాయి. మా గ్రామంలో పంచాయతీకి ఇవే చివరి ఎన్నికలు. ఎలాగోలా వచ్చే ఎన్నికల్లోగా మమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తరు. ఆ మాట తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం చెప్పలేం. – ఈదె సత్తయ్య,
వల్లూరు.
పెరిగిన చికెన్ కల్చర్..
గెలుపు ముఖ్యం బిగిలూ..
గెలుపు ముఖ్యం బిగిలూ..


