పాన్‌గల్‌లో పట్టుబడిన చీరలు
పాన్‌గల్: మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మద్దతు దారుల ఇళ్లలో చీరలు పట్టుబడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా బీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లలో ఓటర్లకు పంచేందుకు చీరలు ఉన్నాయన్నా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వందల సంఖ్యలో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ నాయకుడు చీరలను కేఎల్‌ఐ కాల్వ సమీపంలోని చెట్ల పొదల్లో వేశారు. అనంతరం కాంగ్రెస్ మద్దతుదారుడి ఇంటిలో రెండు కాటన్ల మద్యం పట్టుబడిందని, రెండు సంఘటనలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


