ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2837
జడ్చర్ల/దేవరకద్ర/నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,837, కనిష్టంగా రూ.2,099 ధరలు లభించాయి. అదేవిధంగా హంస రూ.1,901, కందులు రూ.6,500, వేరుశనగ గరిష్టంగా రూ.7,668, కనిష్టంగా రూ.7,351, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,025, కనిష్టంగా రూ.1,650 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ. 2673, కనిష్టంగా రూ.2406, హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.2009గా ఒకే ధర పలికాయి. కాగా.. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం ఉల్లి పాయల బహిరంగ వేలం నిర్వహిస్తారు.
నవాబుపేటకు పోటెత్తిన ధాన్యం
నవాబుపేట మార్కెట్ యార్డుకు భారీగా ధాన్యం పోటెత్తింది.ఇప్పటికే మార్కెట్‌లో 40 వేల బస్తాల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం 55 వేలకు పైగానే ధాన్యం రాగా టెండర్లు సైతం సోమవారం నిర్వహించాల్సి వచ్చింది. మంగళవారమే యార్డు నిండిపోగా బుధవారం ధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో రోజు వారి టెండర్లు వేసేలా మార్కెట్ అధికారులు వ్యాపారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
‘జైభీమ్ జైమీమ్’
నినాదంతో ముందుకు..
ఆత్మకూర్: జై భీమ్, జై మీమ్ నినాదంతో ముందుకెళ్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని ఏఐఎంఐఎం రాష్ట్ర సంస్థాగత బాధ్యుడు అబ్దుల్‌సమద్‌బిన్ అబ్దాద్ అన్నారు. మంగళవారం ఆత్మకూర్‌లోని ఎంజీ గార్డెన్‌లో ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తలతో సంస్థాగత సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అనవసరమైన విషయాలపై రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం సత్తాచాటే విధంగా కార్యకర్తలు ముందుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా నిరంజన్, ప్రధానకార్యదర్శిగా షాకీర్, మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఇమ్రాన్, ప్రధానకార్యదర్శిగా జావిద్, కోశాధికారిగా ఫిరోజ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జుబేర్‌బిన్‌సయిద్, ఎంఏ రహీం, అబ్దుల్‌హాదీ, సాదతుల్లాహుస్సేన్, గయాసుద్దీన్, ఖదీర్, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2837
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2837


