బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
వీపనగండ్ల: మండలంలోని సంగినేనిపల్లికి చెందిన పికిలి శేఖర్ (40) శనివారం సాయంత్రం బైక్‌పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్ కథనం ప్రకారం.. శేఖర్ శ్రీరంగాపూర్ మండలంలోని నాగరాల గ్రామంలోని తమ బంధువుల ఇంటి వెళ్లి తన సొంత గ్రామానికి వస్తుండగా సంగినేనిపల్లి, కల్వరాల గ్రామాల మధ్య బైక్ అదుపు తప్పి కిందపడడంతో మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమో దు చేసినట్లు ఆయ న తెలిపారు. మృతుడికి భార్య రేణు క, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


