మార్నింగ్ వాక్‌కు వెళ్లి అనంతలోకాలకు..
గోపాల్‌పేట: మార్నింగ్ వా క్‌కు వెళ్లిన మహిళను మృత్యువు వెంటాడింది. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ని నర్సింగాయపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌కుమార్ వివరాల మేరకు.. నర్సింగాయపల్లికి చెందిన రాకాసి సుగుణమ్మ (62), రాకాసి అనసూయ మ్మ, మరికొందరు రోజు గ్రామం నుంచి సమీ పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు మార్ని ంగ్ వాక్ చేసేవారు. రోజు మాదిరిగానే సోమ వారం కూడా అందరూ మార్నింగ్ వాక్‌కు వెళ్లగా.. వెనకాల నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం సుగుణమ్మ, అనసూయమ్మలను ఢీకొట్టింది. దీంతో సుగుణమ్మ రోడ్డుపై, అనసూయమ్మ రోడ్డు పక్కన పడిపోయారు. సుగుణమ్మ పైకి లేచే క్రమంలో మరో ద్విచక్ర వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భర్త వే ధింపులు భరించలేక
మహిళ ఆత్మహత్య
మల్దకల్: కుటుంబ కలహా లు, భర్త వేధింపులు భరించలేక మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకు న్న సంఘటన సోమవారం మండలంలోని మద్దెలబండ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా, కలిగిరి మండలంలోని వీరనకల్లు గ్రామానికి చెందిన అనిత (22) తన భర్తతో కలిసి మూడు నెలల క్రితం మద్దెలబండ గ్రామంలో జ్యూస్ షాపు నిర్వహించుకునేందుకు వలస వచ్చారు. రోజులాగే షాపు నిర్వహిస్తున్న అనిత సోమవారం భర్త హరికృష్ణ వేధింపులు భరించలేక మనస్థాపానికి గురైంది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను సంప్రందించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
యాచకుడి మృతి
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని గాంధీనగర్ అశోక్ టాకీస్ వద్ద సోమవారం ఓ యాచకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ మాధవరెడ్డి వివరాల మేరకు.. వంగూర్ మండలం చౌదర్‌పల్లికి చెందిన శంకరప్ప (60) పదేళ్లుగా పట్టణంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్లపైనే నిద్రిస్తూ.. దొరికిందల్లా తింటూ ఉండటంతో అతడికి అనారోగ్య సమస్యలతో పాటు ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మార్నింగ్ వాక్‌కు వెళ్లి అనంతలోకాలకు..


