ఆలయ అర్చకుడిపై వేటు
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయ అర్చకుడిపై ఆ శాఖ అధికారులు వేటు వేశారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ గురువారం తెలిపారు. శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ ర్మపై కొద్ది రోజులుగా పలు ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. ఆ ఆరోపణలపై దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆనంద్ శర్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని, ఆరోపణల అంశాలను నిర్ణీత సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.
క్లినిక్ సీజ్
పాలమూరు: మహబూబ్‌నగర్ రాంమందిర్ చౌరస్తాలో శ్రీరామ్ అనే వ్యక్తి 16 ఏళ్లుగా శ్రీరామ్ క్లినిక్ పేరుతో అక్రమంగా ఆస్పత్రి నడుపుతున్నారు. నిబంధనలు అతిక్రమించి రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, సెలెన్స్ పెట్టడం, యాంటీబాయిటిక్స్ ఇవ్వడం చేస్తున్నారు. దీంతో గురువారం జిల్లా మాస్‌మీడియా అధికారి మంజుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడంతో పాటు పోలీసు కేసు కూడా నమోదు చేశారు.


