ప్రైవేట్‌లో కత్తెర కాన్పులే | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌లో కత్తెర కాన్పులే

Apr 22 2025 1:19 AM | Updated on Apr 22 2025 1:19 AM

ప్రైవేట్‌లో కత్తెర కాన్పులే

ప్రైవేట్‌లో కత్తెర కాన్పులే

ప్రైవేట్‌లో

కత్తెర

కాన్పులే

● జిల్లాలో ఉన్న చాలా వరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు కన్పించకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు ఉండవు. ఇక పని చేసే నర్సింగ్‌ సిబ్బందితో పాటు టెక్నీషియన్లు సైతం అర్హత కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు. సరైన చదువు, శిక్షణ లేని వారితో విధులు నిర్వహిస్తుంటారు. సరైన పరిజ్ఞానం లేని సిబ్బంది చికిత్స కోసం వచ్చిన వారి ప్రాణాలతో చెలగాటం అడుతుంటారు. కొన్ని ఆస్పత్రుల్లో వార్డు బాయ్‌లతో ఇంజక్షన్స్‌ ఇప్పించడం, సైలెన్స్‌ పెట్టించడం వంటి ఘటనలు దర్శనం ఇస్తున్నాయి.

జిల్లాలో 64.21శాతం సిజేరియన్లు

ఆరోగ్యశాఖలోని ఓ అధికారి సొంత ఆస్పత్రిలో అధిక ఆపరేషన్లు

ఒక్కో కాన్పుకి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్న వైనం

దృష్టి సారించని వైద్యారోగ్యశాఖ

పాలమూరు: ఒకవైపు ప్రభుత్వం అన్ని రకాల ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెంచాలని కసరత్తు చేస్తుంటే.. జిల్లాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాహకులు డెలవరీ అంటే కేవలం సిజేరియన్‌ అనే విధంగా కత్తెర కాన్పులు చేసి డబ్బులు దండుకుంటున్నారు. వైద్యం అంటేనే వ్యాపారం అనే విధంగా పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు. ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు కోతల కాన్పులే చేస్తున్నారు. జిల్లాలో 2022 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు 48 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 16,109 ప్రసవాలు అయితే ఇందులో 5,698 సాధారణ కాన్పులు కాగా.. 10,411 సిజేరియన్లు చేయడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 64.21 శాతం సిజేరియన్లు చేశారు.

ప్రభుత్వ వైద్యులే అధికం

జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యాధికారులతో పాటు జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న చాలామంది ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యశాఖలో పని చేసే ఓ జిల్లా స్థాయి అధికారికి ఉన్న నర్సింగ్‌ హోంలో అయితే సాధారణ ప్రసవాలే ఉండటం లేదు. ఆరోగ్యశాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అక్కడ కేవలం సిజేరియన్స్‌ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒక ప్రభుత్వ జిల్లాస్థాయి అధికారి నర్సింగ్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇక మిగిలిన ఆస్పత్రుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జనరల్‌ ఆస్పత్రిలో పని చేసే వైద్యులు మధ్యాహ్నం కాకముందే విధులు ముగించుకొని సొంత క్లినిక్‌లకు వెళుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒకరిద్దరు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కేసులను సైతం సొంత ఆస్పత్రులకు రెఫర్‌ చేసి పంపుతున్నట్లు సమాచారం.

ఆడిట్‌ చేస్తాం..

జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్‌ అధికంగా చేస్తున్న వాటితో అన్నింటిపై ఆడిట్‌ పూర్తి చేస్తాం. ఇందులో ఏదైనా ఆస్పత్రిలో సెక్షన్లు అధికంగా చేస్తున్నట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటాం. ప్రసవాలపై ప్రోగ్రామ్‌ అధికారులతో విచారణ చేయిస్తాం.

– డాక్టర్‌ కృష్ణ, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement