మహమ్మదాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం కూరగాయలు, భోజనం, ఆకుకూరలు, గుడ్డు ఇవ్వకపోవడంపై నిర్వాహకులపై, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంచర్ల, గాధిర్యాల్ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత కంప్యూటర్ ద్వారా బోధన చేసి వారి ప్రగతిని పరిశీలించాలన్నారు. 9వ తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో మా ట్లాడారు. విద్యార్థులు తమ లక్ష్యం మేరకు చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో మిషన్ భగీరథ, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, సాగునీరు, పంటల సాగుపై మాట్లాడారు. బోరు బావుల కింద వేసిన సుమారు 140 ఎకాల్లో పంటలు ఎండిపోయినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.
అర్‌అండ్‌ఆర్ కాలనీల్లో
మౌలిక వసతులు కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో అన్నిరకాల మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో కలెక్టర్ విజయేందిరతో కలిసి అధికారులు సమీక్షించారు. ఉదండపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంటతండా, రేగడి పట్టితండా, చిన్నగుట్టతండా, శౠమగడ్డతండా, ఒంటిగుడిసెతండా పోలేపల్లి, వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు 300 గజాల స్థలం, ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, పార్కు పనులు నిర్ధేశిత సమయంలోగా పూర్తి చేయాలని వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ వాటర్ పైపులైన్లు ఇచ్చిన గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్‌మోహన్‌రావు, స్పెషల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్‌డీఓ నవీన్ పాల్గొన్నారు.
నంచర్ల జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్నభోజనం పరిశీలన


