స్టేషన్ మహబూబ్‌నగర్: ఈనెల 24 నుంచి 31 వరకు శంషాబాద్ తొండుపల్లిలో జరిగే తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (రూరల్), అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ అండర్–17 క్రికెట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు టీడీసీఏ ఉమ్మడి జిల్లా కన్వీనర్ నవీన్‌కుమార్ వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్రదర్‌హుడ్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అండర్–17 క్రికెట్ టోర్నీకి మహ్మద్ సోహైల్ (షాద్‌నగర్), దక్ష్ పాటిల్ (మహబూబ్‌నగర్), విరాట్‌కుమార్ (భూత్పూర్), సంజునాయక్ (అచ్చంపేట) రవితేజ (వనపర్తి) ఎంపిరైనట్లు తెలిపారు. వీరు టీడీసీఏ రూరల్ వారియర్స్ జట్టు తరపన అమెరికన్ జట్టుతో తలపడుతారన్నారు. టీడీసీఏ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 24న శంషాబాద్ మండలం తొండుపల్లిలోని ఎంపీఎస్ మైదానంలో అండర్–17 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, 31న జరిగే ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. టీడీసీఏ రూరల్ వారియర్స్ జట్టు మేనేజర్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్రదర్‌హుడ్ క్రికెట్ అకాడమీ కోచ్ ఎండి.రియాజుద్దీన్, టీడీసీఏ సభ్యులు నవాజ్‌షా, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.