జైలులో ఖైదీలుసత్ప్రవర్తనతో మెలగాలి
పాలమూరు: జిల్లా జైలులో వివిధ రకాల కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు పూర్తిగా సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. నగరంలో ఉన్న జిల్లా జైలును మంగళవారం న్యాయమూర్తి సందర్శించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలకు సంబంధించిన బ్యారక్‌లు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరు తనిఖీ చేశారు. అనంతరం కిచెన్, జైలు అంతర్గత పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత ఖైదీలకు నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ కొందరు క్షణికావేశంలో చేసిన తప్పులు మళ్లీ బయటకు వెళ్లిన తర్వాత చేయకుండా ఉత్తమ జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఇందిర, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, మెడికల్ ఆఫీసర్ మిర్జా అలీబేగ్, రవీందర్, యోగేశ్వర్‌రాజ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
చైనా మాంజాపైపూర్తిగా నిషేధం: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో చైనా మాంజాపై పూర్తిగా నిషేధం ఉందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయాలు చేసిన లేదా వినియోగించిన దాని వల్ల ఎవరికై నా ప్రమాదం జరిగినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు. సాఽ దారణ ధారాలతో గాలిపటాలు ఎగురవేయాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం జరిగినట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలని కోరారు.
‘సర్వే దరఖాస్తులుపెండింగ్‌లో పెట్టొద్దు’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సర్వే చేయాల్సిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. మంగళవారం తన చాంబర్‌లో అన్ని మండలాల సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సర్వేయర్లు తమ స్థాయిలో మండలాల్లో సర్వే చేయాలని, పెండింగ్ పెట్టొద్దని సూచించారు. ఎఫ్‌లైన్ పిటిషన్‌లు ఎప్పటికప్పుడు ఫీల్డ్‌కు వెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ సర్వే అశోక్ పాల్గొన్నారు.
8న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 18వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల సబ్ జూనియర్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను 8న జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఎంపికలు ప్రారంభమయవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ ద్వారా జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని ఆయన కోరారు.


