గ్రామాల్లో క్రీడాసందడి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో క్రీడాసందడి

Jan 7 2026 8:34 AM | Updated on Jan 7 2026 8:34 AM

గ్రామ

గ్రామాల్లో క్రీడాసందడి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్‌ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్‌, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్‌, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్‌ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్‌ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్‌ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.

వివిధ క్రీడాంశాల్లో పోటీలు

సీఎం కప్‌లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, లాన్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్‌, షూటింగ్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, సెపక్‌తక్రా, చెస్‌, బేస్‌బాల్‌, నెట్‌బాల్‌, కిక్‌బాక్సింగ్‌, సైక్లింగ్‌, రోయింగ్‌, స్క్వాష్‌ రాకెట్‌, కనోయింగ్‌–కయాకింగ్‌, వుషు, అత్యపత్య, పవర్‌ లిఫ్టింగ్‌, సాఫ్ట్‌బాల్‌, తైక్వాండో, బిలియర్డ్స్‌ స్నూకర్స్‌, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్‌, ఫెన్సింగ్‌, పికిల్‌బాల్‌, సెయిలింగ్‌, బాల్‌బ్యాడ్మింటన్‌, మల్లకంబ్‌, పారా గేమ్స్‌, రీక్రియషనల్‌ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు.

గతేడాది 90 పతకాలు..

సీఎం కప్‌ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్‌ నుంచి 2025 జనవరి 2 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్‌ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్‌బాల్‌ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించారు. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్‌నగర్‌ క్రీడాకారులు 9 బంగా రు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సొంతం చేసుకున్నారు.

ఔత్సాహికులకు మంచి అవకాశం

సీఎం కప్‌ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్‌ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్‌ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్‌ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు https://satg.telangana.govi.in/ cmcup వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. – ఎస్‌.శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ

సీఎం కప్‌ కోసం సన్నాహాలు

గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు

ఈ నెల 17వ తేదీ నుంచి

ఫిబ్రవరి 26 వరకు క్రీడలు

గ్రామాల్లో క్రీడాసందడి1
1/1

గ్రామాల్లో క్రీడాసందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement