జడ్చర్ల టౌన్: పర్యావరణ సమతుల్యతో ప్రతిజీవి తనవంతు పాత్ర పోషిస్తుందని, ఊర పిచ్చుక తనవంతు పాత్ర పోషిస్తున్నందున వాటి సంతతి పెంపునకు కృషిచేద్దామని డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుకన్య పిలుపునిచ్చారు. గురువారం కళాశాల బొటానికల్ గార్డెన్‌లో పిచ్చుకలకోసం డా.సదాశివయ్య ఆధ్వర్యంలో తైదలు, కొర్రలు, సామలు, ఊదలు, జొన్నలులాంటి గింజలు, నీళ్లను ప్రత్యేక పాత్రల్లో ఏర్పాటుచేయగా వాటిని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఊరపిచ్చుకల సంఖ్య తగ్గటంతో పర్యావరణ సమతుల్యతకు ముప్పుగా మారుతుందన్నారు. ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహించి వాటి పరిరక్షణకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు రవీందర్, భరత్, అభిలాష్ పాల్గొన్నారు.