రూ.15 వేలకు కొని.. యువతిని రూ.25 వేలకు అమ్మకం | - | Sakshi
Sakshi News home page

రూ.15 వేలకు కొని.. యువతిని రూ.25 వేలకు అమ్మకం

Mar 19 2024 12:35 AM | Updated on Mar 19 2024 1:42 PM

- - Sakshi

హసన్‌పర్తి: రూ.15 వేలకు కొని.. రూ.25 వేలకు అమ్మింది. ఇదేదో సంతలోని పశువునో.. ఏదైనా వస్తువో అనుకుంటే పొరపాటు. ఒంటరిగా ఉన్న యువతికి మాయమాటలు చెప్పిన ఇద్దరు మైనర్లు, వారి తల్లినుంచి ఓ మధ్యవర్తి కొన్న రేటు రూ.15 వేలు అయితే.. ఆమె తిరిగి వ్యభిచార గృహ నిర్వాహకులకు అమ్మింది రూ.25 వేలకు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని ఓ ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంనుంచి ఓ యువతి తప్పించుకుంది. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లుగా పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీ కాలర్‌ జాబ్‌ నిమిత్తం ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో దిగింది. ఒంటరిగా ఉండడం గమనించిన ఇద్దరు మైనర్‌ బాలికలు ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. యువతి విషయాన్ని తల్లి మమతకు చెప్పారు. వారి మాయమాటలు నమ్మిన ఆ యువతి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంది.

ఇక్కడ రూ.25 వేలకు అమ్మకం
హైదరాబాద్‌లో రూ.15 వేలుకు కొనుగోలు చేసిన శివమ్మ వంగపహాడ్‌లో శ్యామ్‌రావు కావ్యకు రూ.25 వేలకు విక్రయించింది. రెండు రోజులపాటు వ్యభిచారం చేయాలని బలవంతం చేసింది. అందుకు ఆ యువతి అంగీకరించలేదు. ఈనెల 14న బాధితురాలు వ్యభిచార గృహం నుంచి తప్పించుకుంది. ఓఆర్‌ఆర్‌ వద్ద భూక్యా రాజు అనే యువకుడిని మోటార్‌సైకిల్‌పై లిఫ్ట్‌ తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందన, మమత, ఇద్దరు మైనర్‌ బాలికలతో పాటు కావ్య, శివమ్మలను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.

రూ.15 వేలకు విక్రయం
ఆ యువతిని బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న గీసుకొండకు చెందిన పాకనటి శివమ్మకు రూ.15 వేలకు విక్రయించారు. మొదట శివమ్మతో వెళ్లడానికి ఆ యువతి అంగీకరించలేదు. దీంతో మమత, ఆమె సోదరి చందనలు ఆ యువతిని నిర్బంధించారు. తాడుతో చేతులు కట్టి, సెల్‌ఫోన్‌, బ్యాగ్‌తో పాటు అందులో ఉన్న రూ.2 వేలు లాక్కున్నారు. అనంతరం పాకనటి శివమ్మకు అప్పగించారు. ఆమె ఈ నెల 12న యువతిని కారులో ఎక్కించుకుని వంగపహాడ్‌కు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement