అష్టాదశ శక్తిపీఠాల్లోని ఐదో పీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరిగి 40 రోజులు(మండలం) రోజులు అయిన నేపథ్యంలో విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక హోమాలు చేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. మండల పూజలు మూడు రోజులపాటు జరగనునున్నట్లు కార్యనిర్వాహణ అధికారి పేర్కొన్నారు. అలంపూర్


