మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సెమిస్టర్–1, 2 పరీక్షలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా పీయూ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షకు మొత్తం 687 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 683 మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అబ్జర్వర్ కుమారస్వామి, మొయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


