రైతులకు ఉచిత న్యాయ సాయం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఉచిత న్యాయ సాయం

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

దేవరకద్ర: రైతులు తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, జిల్లా జడ్జి ఇందిర తెలిపారు. మంగళవారం దేవరకద్ర రైతువేదికలో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో రైతులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలు, రైతుల హక్కులు, సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న న్యాయసేవలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి సంబంధించిన వివాదాలు, ఇతర న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు న్యాయసేవ అధికార సంస్థను సంప్రదించాలని జడ్జి సూచించారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాజేందర్‌ అగర్వాల్‌, శివకుమార్‌, హరీష్‌, ప్రణిత రైతులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

రైతు మృతి

మల్దకల్‌: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప(50) మంగళవారం పత్తి పంటకు నీరు పె ట్టేందుకు బోరు మోటార్‌ ఆన్‌ చేస్తున్న క్రమంలో అప్పటికే తెగి పడిన విద్యుత్‌ వైరు తగిలి విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంకరమ్మ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

భార్యతో గొడవపడి

భర్త ఆత్మహత్య

గోపాల్‌పేట: భార్యతో గొ డవ పడి క్షణికావేశంలో భ ర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాల మేరకు.. గోపాలపేటలోని హనుమాండ్లగడ్డ కాలనీకి చెందిన కొంకలి సుక్కన్న, కర్రె శాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు శివుడు (33)కు భార్య యాదమ్మ తో 10 రోజుల క్రితం గొడవ జరగగా.. ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత మాట్లాడి సోమ వారం గోపాల్‌పేటకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి గొడవ జరగగా.. శివుడు ఉరేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి త లుపులు గొళ్లెం పెట్టుకున్నాడు. గతంలో బెది రించినట్లుగానే ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడని అందరూ బయట కూర్చొని ఉన్నారు. చాలాసేపటి వరకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శివుడు ఉరేసుకుని కనిపించాడు. శివుడికి భార్యతో పాటు కుమార్తె ఉంది. శివుడు అన్న మల్లయ్య రెండేళ్ల క్రితం ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వివాహిత బలవన్మరణం

లింగాల: మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని పద్మ(38)ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు.. మతిస్థిమితం లేని ఆమె కుటుంబసభ్యులతో గొడవపడి క్షణికావేశానికి గురై గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుంది. మృతురాలు గతంలోనూ రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త సౌడమోని సురేష్‌, నలుగురు సంతానం ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ చంద్రకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement