‘రేవంత్‌’ సల్లంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌’ సల్లంగా ఉండాలి

Published Thu, Dec 7 2023 12:26 AM

చీరలు పంపిణీ చేస్తున్న కుటుంబ సభ్యులు   - Sakshi

వంగూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మా గ్రామ బిడ్డ రేవంత్‌ పది కాలాల పాటు సల్లంగా ఉండాలని కొండారెడ్డిపల్లి మహిళలు దీవించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా బుధవారం గ్రామంలోని మహిళలందరికీ ఆయన కుటుంబసభ్యులు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మాఊరి పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేసిన మా రేవంత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచిపేరు తెచ్చుకోవాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వేమారెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొండారెడ్డిపల్లిలో

మహిళలకు

చీరల పంపిణీ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement