నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గద్వాల, అలంపూర్‌లో బీఆర్‌ఎస్, మిగతా ఐదు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కల్వకుర్తి మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14,00,049 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌కు 6,39,628, బీఆర్‌ఎస్‌కు 5,34,401, బీజేపీకి 1,18,513 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 1,05,227 ఓట్ల ఆధిక్యతతో బీఆర్‌ఎస్‌పై పైచేయిగా నిలిచింది. సగటున హస్తానికి 45.69 శాతం ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌కు 38.17 శాతం ఓట్లు మాత్రమే పోలైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.