
దేవరకద్ర మార్కెట్‌లో ధాన్యం రాశులు
పాలమూరు: అసెంబ్లీ ఎన్నికల్లో పల్లెతో పోల్చుకుంటే పట్టణవాసులు ఓటుకు దూరంగా ఉన్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో దాదాపు 50 వేల ఓటర్లు ఓటు వేయకపోవడం గమనార్హం. గతంలో కంటే ఈసారి గ్రామాల్లో పోలింగ్ శాతం రెట్టింపు అయ్యింది. పల్లెల్లో కూలీ పనులకు, వలస వెళ్లిన వారు ఇలా ప్రతిఒక్కరు చాలా వరకు ఓటు కోసం స్వగ్రామాలకు చేరుకున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పొల్చితే ఈసారి దాదాపు 3 శాతం ఓటింగ్ తగ్గింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ హన్వాడ మండలం రామన్నపల్లిలో 94.77 శాతం నమోదవగా.. అత్యల్పంగా పట్టణంలోని రాజేంద్రనగర్ 255 బూత్‌లో 43.34 శాతం నమోదైంది. మొత్తం 272 పోలింగ్ బూత్‌లలో 70.56 శాతం పోలింగ్ జరిగింది. ఇక నియోజకవర్గంలో పురుషులు 1,25,843, మహిళలు 1,26,499, ఇతరులు 13 మంది కలిపి మొత్తం 2,52,355 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 1,78,069 మంది ఓటుహక్కు వినియోగించుకోగా.. వీరిలో పురుషులు 89,384 మంది, మహిళలు 88,676, ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు. దాదాపు 74,286 మంది ఓటు వేయలే దు. ఈసారి ఎన్నికల్లో మహిళల కంటే పురుషులు 708 మంది అధికంగా ఓటు వేయడం విశేషం.
బాదేపల్లి యార్డులో
ధాన్యానికి రికార్డు ధర
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యానికి రికార్డు స్థాయి ధర దక్కింది. ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యానికి క్వింటాల్ గరిష్టంగా రూ.3,096, కనిష్టంగా రూ.1,751 ధరలు లభించాయి. అలాగే శ్రీరామ్ గోల్డ్ ధాన్యానికి రూ.2,996, హంస రకానికి గరిష్టంగా రూ.2,921, కనిష్టంగా రూ.1,656, మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,331, కనిష్టంగా రూ.2191, ఆముదాలకు రూ.5,321, జొన్న క్వింటాల్ రూ.1,912 చొప్పున పలికాయి. కాగా యార్డుకు దాదాపు 15 వేల క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి రావడంతో యార్డు ఆవరణ కిక్కిరిసిపోయింది.
లావాదేవీలు ప్రారంభం..
దేవరకద్ర మార్కెట్‌కు రెండు రోజుల సెలవు తర్వాత శుక్రవారం తిరిగి లావాదేవీలు ప్రారంభమయ్యాయి. మార్కెట్‌కు వివిధ గ్రామాల నుంచి దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,979, కనిష్టంగా రూ.2,462 వచ్చాయి. హంసకు గరిష్టంగా రూ.2 వేలు, కనిష్టంగా రూ.1,874, ఆముదాలకు గరిష్టంగా రూ.5,429 ఒకే ధర వచ్చింది.
ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటాల్ రూ.3,156