
ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న వైద్యులు
పాలమూరు: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల దుష్ఫలితాలు ఉంటాయని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ జీవన్ అన్నారు. ఈనెల 18నుంచి 24వరకు ప్రపంచ యాంటీ మైక్రోబయల్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం వల్ల శరీరంలో సహజసిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. దీనివల్ల సూపర్ బాక్స్ ఏర్పడి ఏ మందు వేసుకున్నా ఫలితం ఉండదన్నారు. ప్రమాదకర యాంటీ బయాటిక్స్ వల్ల శరీరంలో మంచి బాక్టీరియా చనిపోయి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. దీంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. వైద్యు ల సలహాలు, సూచన లేకుండా యాంటీ బయాటిక్స్ ఎలాంటి పరిస్థితిలో వాడరాదన్నారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్‌ఓడీ రామకిషన్, హెచ్‌ఓడీలు రమాదేవి, నవల్ కిశోర్, వైద్యులు లక్ష్మీపద్మప్రియ, అభిలాష, సుజాత, ఆర్‌ఎంఓ శిరీష పాల్గొన్నారు.