
ఎంపికై న యోగా జట్టుతో పీడీలు, సిబ్బంది
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఆలిండియా సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల కోసం యోగా, టేబుల్ టెన్నిస్ జట్లను ఎంపిక చేశారు. యోగాలో మొత్తం 8 మంది విద్యార్థులను ఎంపిక చేయగా.. వీరు తమిళనాడులో అన్నా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. అలాగే టేబుల్ టెన్నిస్‌లో 5 మంది విద్యా ర్థులను ఎంపిక చేయగా.. వీరు చైన్నెలోని అంబేద్కర్ లా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. వీటితోపాటు శుక్రవారం ఫుట్‌బాల్ సెలక్షన్స్ జిల్లాకేంద్రంలోని స్టేడియం మైదానంలో నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పీడీ సత్యభాస్కర్‌రెడ్డి, కవిత, శ్వేత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.