
చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో బాలోత్సవ్–2023 కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పలు విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించగా, చక్కటి ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాసులు, సీఎంఓ బాలుయాదవ్, డీఎస్‌ఓ శ్రీనివాస్, గుమ్ముడాల చక్రవర్తి, వెంకటచలపతి పాల్గొన్నారు.