కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026–2027 వి ద్యా సంవత్సరంలో మిగిలిన పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేసినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ప్రకటించినప్పటికీ అనివార్యకా రణాలతో ఈ ప్రవేశాల ప్రక్రియను రద్దుచేస్తున్నామ ని, విద్యార్థులు ఈమార్పును గమనించాలన్నారు.
పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని ఆందోళన
కేయూలో తమకు పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని ముగ్గురు అభ్యర్థులు శుక్రవారం వీసీ చాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఆ ముగ్గురు అభ్యర్థులతో మాట్లాడారు. కొన్నేళ్ల క్రితమే పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ జరిగిందని, ఇప్పుడు తన చేతుల్లో ఏమిలేదని స్పష్టం చేశారు.
టెన్నికాయిట్ జట్ల ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం 13వ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్–18 జూనియర్ బాలబాలికల టెన్నికాయిట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో సుమారు 150 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నవంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ కోశాధికారి అలువాల రాజకుమార్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారపు శ్యామ్‌కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి జహూర్, సీనియర్ క్రీడాకారులు వెంకన్న, మేకల ధర్మరాజు, బూజుగుండ్ల సీతారాం, తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ సమ్మయ్యకు అవార్డు ప్రదానం
కేయూ క్యాంపస్ : కాక తీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ గాదె సమ్మయ్య కు శుక్రవారం హైదరా బాద్‌లోని సీఎస్‌ఐఆర్ –నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) వార్షిక మహసభలో లైఫ్ మెంబర్ అవార్డు ప్రదానం చేశారు. ఫార్మసీ పరిశోధన రంగంలో సేవలకు గాను సమ్మయ్యకు ఈ అవార్డు అందజేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రధాతునిగమ్ లిమిటెడ్ సీంఎడీ ఎస్‌వీఎస్ నారాయణ మూర్తి చేతులమీదుగా సమ్మయ్య అవార్డు అందుకున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఖానాపురం : అనుమానాస్ప ద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా ఖానా పురం మండలం మనుబోతులగడ్డలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంచె బాలరాజు (39) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఈనెల 29న గ్రామానికి చెందిన ఓ మిత్రుడు.. బాలరాజు ఇంటికొచ్చి అతడితో మా ట్లాడారు. అనంతరం మిత్రుడిని ఇంటి వద్ద దింపి వస్తానని బాలరాజు కుటుంబీకులకు చెప్పి బైక్‌పై తీసుకెళ్లి వైఎస్‌ఆర్ సెంటర్‌లో దించాడు. అక్కడే ఫోన్‌లో ఎవరితో మాట్లాడి వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేయడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురై మిత్రులకు ఫోన్ చేసి ఆరా తీసి సమీప ఇళ్లలో వె తికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం బాలరాజు బైక్ సంగెం కాల్వ ఒడ్డున స్థానికులకు కనిపించడంతో కుటుంబీకులకు తెలి పారు. దీంతో వారు ఘటనాస్థలికి చేరుకుని సమీ పంలో వెతకగా సంగెం కాల్వలో బాలరాజు మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. కాగా, మృతుడికి భార్య సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు.


