రోడ్డుపై మార్కింగ్‌ చేస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై మార్కింగ్‌ చేస్తుండగా..

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

లారీ ఢీకొని యువకుడి మృతి

రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి సమీపం వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శుక్రవారం వైట్‌లైన్‌ మార్కింగ్‌ చేస్తున్న ఐదుగురిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై భరత్‌ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కూలీలు శుక్రవారం మిషన్‌తో రోడ్డుపై వైట్‌లైన్‌ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఐదుగురిని ఢీకొంది. ఈ ఘటనలో నీరజ్‌ (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే 108లో ఎంజీఎం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై పేర్కొన్నారు.

● నలుగురికి తీవ్ర గాయాలు

● గోవర్ధనగిరి సమీపంలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement