రోడ్డు ఏదైనా సరే ప్రయాణించేందుకు రెడీ అంటూ దూసుకుపోతుంది ఈ–బాజా–61 వెహికిల్. నిట్ వరంగల్‌కు చెందిన మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన 40 మంది విద్యార్థులు టీం స్పార్థక్ పేరిట ఈ వాహనాన్ని రూపొందించారు. ఏడాది పాటు శ్రమించి రూ. 10లక్షలతో నేటి ఆధునిక యుగానికి తగ్గట్లు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికిల్)ను ఆవిష్కరించారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే సుమారు 50 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. గుట్టలు, కంకర రోడ్డు.. ఇలా రహదారి ఎలా ఉన్నా దూసుకెళ్తుంది ఈ– బాజా–61 వెహికిల్.


