అబ్బురపరిచిన టెక్నోజియాన్‌–26 | - | Sakshi
Sakshi News home page

అబ్బురపరిచిన టెక్నోజియాన్‌–26

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

నేను నా ఊహల్లో...

టెక్‌ఫెస్ట్‌లో ఎగ్జిబిట్స్‌ అదుర్స్‌..

వావ్‌ చాలా అద్భుతంగా ఉంది. నేను ఊహించుకున్న పలు విషయాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కృతమయ్యాయి. నా గమ్యం, నా కలలు డెస్టినేషన్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రోబోను టచ్‌ చేస్తే కళ్ల ముందు కనిపించాయి..

–ఇషిత, ఎంబీఏ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల టెక్నోజియాన్‌–26లో భాగంగా తొలి రోజు శుక్రవారం 50 కిపైగా ఈవెంట్స్‌తో అబ్బురపరచింది. రోబోటిక్‌ రేసింగ్‌ స్మాష్‌ కార్ట్స్‌, స్టార్టప్‌ చాలెంజ్‌ ఇంపాక్ట్‌ ట్యాంక్‌, సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌, మెకాట్రానిక్స్‌గాలా, వెహికిల్‌ డెమాన్‌స్ట్రేషన్‌, రోబోటిక్స్‌, రాకెట్‌ ప్రదర్శన, ఈకో సిటీ, రూబ్‌ వార్స్‌, కేబీసీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలరించిన టాక్‌ షో..

నిట్‌ విద్యార్థులు ప్రజా సేవలోకి రావాలని, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల్లో కాకుండా సివిల్స్‌లో రాణించేందుకు కృషి చేయాలని ఐఏఎస్‌ గరీమీ అగర్వాల్‌ అన్నారు. టెక్నోజియాన్‌–26లో భాగంగా అంబేడ్కర్‌ లర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన టాక్‌ షోలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ పౌరుడి బాధ్యతలు, సివిల్‌ సర్వెంట్స్‌ విజయగాథాలను తెలుసుకోవడం, సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం వంటి లక్షణాలను అలవర్చుకుంటే పబ్లిక్‌ సర్వీస్‌లో రాణిస్తారని తెలిపారు.

నేటితో ముగియనున్న కార్యక్రమం..

సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 శనివారం ముగియనుంది. రెండో రోజు శనివారం డ్రోన్‌ ఏ వార్స్‌, షాడో తెరా, వెహికల్‌ డెమాన్‌స్ట్రేషన్‌, రోడ్‌ సేఫ్టీ, ఇంజనీరింగ్‌ చాలెంజ్‌, హోవర్‌ క్రాఫ్ట్‌, వెంచర్‌ వర్టెక్స్‌ ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement